కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిర్వహించే పెద్ద ఆపరేషన్లు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం జిల్లా రేకుల గుంటకు చెందిన 15 ఏళ్ల సాయి గత మూడేళ్ల నుంచి కడుపు ఉబ్బరం, ప్లేట్‌లెట్లు తక్కువ కావడం, రక్తవాంతుల సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నెల 11వ తేదీన బాలుడు తీవ్ర అస్వస్థతతో సర్జరీ యూనిట్-2లో అడ్మిషన్ అయ్యారు. అక్కడ చీఫ్ డా.రామకృష్ణ నాయక్ బాలుడ్ని అడ్మిషన్ చేసుకొని పరీక్షలు చేశారు. ఈనెల 13వ తేదీన బాలునికి యూనిట్ చీఫ్ రామకృష్ణనా యక్, అసోసియేట్ ప్రొఫెసర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు చైతన్యవాణి, మన్సూర్‌బాషా, అనస్థీషియా వైద్యులు శారద ాదాపు 2.5 గంటలు శ్రమి ంచి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. బాలుడు ఆరోగ్యంగా కోలుకున్నాడు.