ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదిలో కేంద్ర ఎన్నికల సంఘం 30 లక్షల ఓట్లను తొలగించిందని చెబుతున్నాయి. 2023 జనవరి 6వ తేదీ నుంచి 2024 జనవరి 22వ తేదీ మధ్య 30 లక్షల ఓట్లను తొలగించారు. ఇందులో 14.26 లక్షల ఓట్లు వలస వెళ్లిన వారు అని తీసివేశారు. వలస పేరుతో తమ మద్దతుదారుల ఓట్లు తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు ప్రక్రియలో మృతులు, ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే తొలగిస్తారు. ఈ సారి అందుకు భిన్నంగా ఓట్లను తీసివేశారు.