ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల వేట సాగించనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్ధానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి ఏపీసీసీ దరఖాస్తులు స్వీకరించనుంది. ఉదయం 11 గంటలకు అంధ్రరత్న భవన్లో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, కేవీపీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు దరఖాస్తు స్వీకరణను ప్రారంభించనున్నారు. షర్మిల రాకతో పోటీ చేసేందుకు అత్యధిక అప్లికేషన్స్ వస్తాయని ఏపీసీసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే అప్లికేషన్స్‌ను ఆన్లైన్లో ఆశావహుల కోసం ఏపీసీసీ సిద్ధంగా ఉంచింది.