ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామంలో మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 128 రకాల సంక్షేమ పథకాలను వివరించి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.