ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడంపై బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని త్వరలో త్రాగు సాగునీటి కష్టాలు తీరనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెలాఖరకు గానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గాని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు.