ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు అప్ప నాచార్యులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు.