స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును ఇజ్రాయెల్ వ్యతిరేకించడాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తప్పుబట్టారు. ఈ వైఖరి మారకుంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్దం సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందని,
తద్వారా అనేక ప్రాంతాల్లో కొత్తకొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకురావొచ్చని హెచ్చరించారు. వెంటనే ఇజ్రాయెల్-హమాస్ యుద్దాన్ని ఆపే విధంగా చర్యలు చేపట్టాలని UNSC సమావేశంలో పేర్కొన్నారు.