ముఖ్యమంత్రి జగన్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నరసాపురం ప్రజల్ని మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మంగళవారం ఆర్డీవో అంబరీష్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.3200 కోట్లు ఆభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి 14 నెలలు గడిచింది. నేటికి శిలాఫలకాలే మిగిలాయన్నారు.ప్రజల ఓట్లతో గెలిచి వారినే ఎమ్మెల్యే మోసం చేశారని ఆరోపించారు. మెడికల్ కాలేజీ అంటూ హడావుడి చేసి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. వచ్చిన కాలేజీని మరో నియోజకవర్గానికి తరలిం చారు. జిల్లా కేంద్రం వస్తుందంటూ ప్రజల్ని నమ్మించారు. చీఫ్ విప్ పదవి తీసుకుని జిల్లా కేంద్రం భీమవరం తరలివెళ్లుతున్నా నోరు మొదపలేదు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో హడావుడిగా ముఖ్యమంత్రి జగన్‌ను తీసుకొచ్చి 2022లో రూ.3200 కోట్ల ఆభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయి ంచారన్నారు. హార్భర్, వశిష్ఠా వారధి, ఆక్వా యూనివర్సిటీ, వాటర్ గ్రిడ్, సబ్‌స్టేషన్, వియర్ ఛానల్, రెగ్యులేటర్లు వంటి పనులు వాటిలో ఉన్నాయన్నారు. మూడు నెలల్లో ఈ పనుల్ని ప్రారంభి స్తామని ప్రజల్ని నమ్మించిన ముదునూరి 14 నెలలు గడుస్తున్నా వాటి గురించి పట్టించు కోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు ఆడిగే ఆర్హత ముదునూరికి లేదన్నారు.చిటికెల రామ్మోహన్, అండ్రాజు రామన్న, దానియేలు, సత్యనారాయణరాజు, కృష్ణ, ప్రభు దాసు, నారాయణ, పండు, హేమలత, రెడ్డిం శ్రీను పాల్గొన్నారు.