ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్వరం మరింత పెంచారు. అధికార వైఎస్ఆర్ సీపీతోపాటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్‌వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు.