టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ యువగళం పాద యాత్రలో ప్రారంభం నుంచి ముగిసే వరకు పాల్గొన్న ఇద్దరు యువకులను ఘనంగా సత్కరిం చారు. పెనుకొండ పట్టణానికి చెందిన విష్ణువికాస్ రాయల్, మండంలోని రొప్పాలకు చెందిన రాజేష్చౌదరి అనే యువకులు... నారా లోకేశ పాదయాత్రలో కుప్పం నుంచి విజయనగరంలో యాత్ర ముగిసేవరకు ఆయన వెంటే ఉండి వలంటీర్లుగా పనిచేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. దీంతో నారాలోకేశ జన్మదినాన్ని పురస్కరించుకుని వారిని మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సత్కరించారు. టీడీపీ నాయకులు వెంకటరాముడు, కేశవయ్య, సర్పంచ శ్రీనివాసులు, కన్వీనర్లు సిద్దయ్య, రవికుమార్, శశిభూషణ్, శ్రీనివాసులు తదితరులు, పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.