నంద్యాల వైసీపీలో అధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యే శిల్పా రవి, జెడ్పీటీసీ గోకుల్ క్రిృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. శిల్పా రవిని స్థానికేతరుడు అని గోకుల్ విమర్శిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా స్థానికేతరుల కబంధ భస్తాల్లో నంద్యాల నలిగిపోతుందని పేర్కొన్నారు. వారి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆత్మ గౌరవ ఓదార్పు యాత్ర చేపట్టారు. గోకుల్ క్రిృష్ణారెడ్డి యాత్రను పోలీసులు నంద్యాల బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే శిల్పా రవిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.