దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ఫిబ్రవరి 16న భారత్ బంద్ చేపట్టున్నట్లు రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ బుధవారం వెల్లడించారు. ముజఫర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. రైతులంతా భారత్ బంద్‌లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ బంద్ ద్వారా దేశానికి రైతులు సందేశం ఇవ్వాలని ఆయన విజ్ఞపి చేశారు