టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ను ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో ఏపీ హైకోర్టు జనవరి 10న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నెల 29న ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైనింగ్‌తో పాటు ఐఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేయాలనేది కేబినెట్ నిర్ణయమని చంద్రబాబు తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. అది చంద్రబాబు ఒక్కడి నిర్ణయం కాదని.. మాస్టర్‌ప్లాన్, ఐఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ పై అప్పటి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించిందన్నారు. ఫిర్యాదుదారు గానీ, ఇతరులు కానీ ఆ రోజు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదన్నారు. పారదర్శకంగా చేపట్టిన పనులకు కుట్రకోణం ఆపాదించడం సరికాదని.. చంద్రబాబు లబ్ధి పొందారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.
హెరిటేజ్ సంస్థ లిస్టెడ్ కంపెనీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు అందులో డైరెక్టర్లు మాత్రమే అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి 3 నెలల ముందే 2014 మార్చిలో హెరిటేజ్ తమ ప్లాంట్ల ఏర్పాటుకు దేశంలో, రాష్ట్రంలోని వివి ధ ప్రాంతాల్లో భూములు కొనాలని నిర్ణయించిందన్నారు. దర్యాప్తు సంస్థ పూర్తి వివరాలు కోర్టు ముందుంచకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు సీఎం హోదాలో ప లు నిర్ణయాలు తీసుకున్నారని... అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) ప్రకారం ఆయనపై కేసు నమోదు, దర్యాప్తు కోసం గవర్నర్ నుంచి అనుమతి తప్పనిసరి అన్నారు. సీఐడీ నిబంధనలు పాటించలేదన్నారు.
కృష్ణానది పక్కన ఉన్న తన నివాసాన్ని అద్దెకి ఇచ్చినట్లు ఐటీ శాఖకు సమర్పించిన వివరాల్లో లింగమనేని రమేశ్ పేర్కొన్నారన్నారు. టెండర్ విధానంలోనే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వ పనులను అప్పగించవచ్చని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. చంద్రబాబు బయట ఉండగానే సీఐడీ పలువురి వాంగ్మూలాలు నమోదు చేసిందని... సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆయనపై ఆరోపణలు లేవన్నారు. సాక్ష్యాలన్నీ ఫైళ్ల రూపంలోనే ఉన్నాయని.. కేసు ఫైళ్లన్నిటినీ సీఐడీ ఇప్పటికే సీజ్ చేసిందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల ముందు కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు మేలు చేసేలా ఐఆర్ఆర్ అలైన్మెంట్లో మార్పు చేశారన్నారు. అంతేకాకుండా మాజీ మంత్రి నారాయణ కూడా ఈ అంశంలో కీలక పాత్ర పోషించారని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే గ్రీన్‌ఫీల్డ్ రాజధానికి సంబంధించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెర లేపారని ఆరోపించారు. కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది.