పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ బంగారు గని కుప్ప కూలి 70 మందికిపైగా మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అక్కడి అధికారులు పేర్కొన్నారు. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గత శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.