అన్నమయ్య జిల్లాలో పాపాగ్ని నది వెంబడి ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది.
ఇప్పటి వరకు ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వలేదని పేర్కొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని రెవెన్యూ, గనుల శాఖ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa