మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన తడోబా అభయారణ్యంలో పర్యాటకులకు నల్ల చిరుత కనిపించింది. ముంబై నుంచి వచ్చిన పర్యాటకులు అభయారణ్యంలోని కొలారా ద్వారం గుండా ప్రవేశిస్తున్నారు.
ఈ క్రమంలో వారికి కొద్ది దూరంలో నల్ల చిరుత ఎదురైంది. ఎంతో అరుదుగా కనిపించే ఈ చిరుత.. రెండేళ్ల తర్వాత కనిపించిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.