ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో నెలకొన్న పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు.
ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన ఫ్రాన్సిస్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇది మరింత విస్తృతమయ్యే అవకాశం ఉన్నదని, మూడో ప్రపంచ యుద్ధం కూడా రావొచ్చని అభిప్రాయపడ్డారు.