కేరళలో ఓ వ్యక్తి లాటరీలో రూ.20 కోట్లు గెలుచుకున్నాడు. కిస్మస్-నూతన సంవత్సరం సందర్భంగా ‘బంపర్ కేరళ’ లాటరీ నిర్వహించింది. తాజాగా విజేతలను ప్రకటించింది.
తిరువనంతపురానికి చెందిన లక్ష్మీ లక్కీ సెంటర్ నిర్వాహకుడు దురైరాజ్ రూ.20 కోట్ల విన్నింగ్ టికెట్‌ను ఓ వ్యక్తికి విక్రయించాడు. ఆ టికెట్ నంబర్‌కే జాక్‌పాట్ తగిలినట్లు దురైరాజ్ తెలిపాడు. అయితే ఆ టికెట్ ఎవరు కొన్నారన్నది ఇంకా తెలియరాలేదు.