కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చిత్తూరు జిల్లా పర్యటన ముందుకు మారినట్లు డీసీసీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ బుధవారం తెలిపారు. ముందుగా ఈనెల 29వ తేది మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరులో సమావేశం ఉంటుందని ఖరారైందన్నారు. కానీ, మారిన షెడ్యూల్ మేరకు 28వ తేది ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిరుపతిలోనే ఉమ్మడి జిల్లా (చిత్తూరు, తిరుపతి జిల్లాల) కాంగ్రెస్ పార్టీ కేడర్‌తో వైఎస్ షర్మిల సమావేశమవుతారని చెప్పారు. పీసీసీ అధ్యక్షురాలి పర్యటన మార్పును జిల్లాలోని పార్టీ శ్రేణులు గుర్తించి.. సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.