ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానం (ICJ) ఆదేశిస్తే ఇజ్రాయెల్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని హమాస్ ప్రకటించింది.
అయితే, ఇజ్రాయెల్ సైతం దాన్ని అమలు చేయాలని షరతు విధించింది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న బందీలనూ విడిచిపెడతామని చెప్పింది. గాజా స్ట్రిప్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దిగ్బంధనానికి ముగింపు పలకాలని కోరింది.