విశాఖ నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి స్పందించారు.
ఒక ఫిర్యాదుపై గురువారం మధురవాడ మిథిలాపురి కాలనీ షిప్ యార్డ్ లేఔట్ లోని పార్కు స్థలాన్నిపట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ షిప్ యార్డ్ లేఔట్ లోని పార్కు స్థలాన్ని ఆక్రమించిన్టు అందిన ఫిర్యాదుతో ఇక్కడకు వచ్చినట్టు మేయర్ తెలిపారు.