విశాఖ ప్రజల అవసరాలకు అనుగుణంగా జివిఎంసి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు.
గురువారం ఆమె మూడవ జోన్ 16వ వార్డు పరిధిలోని ఇసుకతోట రామాలయం వద్ద సుమారు రూ. 38. 40 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, కాలువల నిర్మాణానికి పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, కార్పొరేటర్ మొల్లి లక్ష్మీ అప్పారావులతో కలిసి శంకుస్థాపన చేశారు.