చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, సోమల, సదుం, పులిచర్ల, రొంపిచర్ల మండలాలలో శుక్రవారం వైభవంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జెండా వందనం చేశారు. దేశభక్తి నాయకులను గుర్తు చేసుకున్నారు. యువత దేశ నాయకుల అడుగుజాడల్లో నడవాలని అధికారులు, నాయకులు తెలియజేశారు. విద్యార్థులకు క్రీడలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa