మాజీ ఉప రాష్ట్రపతికి వెంకయ్య నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించింది.
అవార్డు రావడం పట్ల వెంకయ్య నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో చేసిన పోస్ట్ లో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ గౌరవం పట్ల తాను నిజంగా వినయంగా ఉన్నానని, ఈ అవార్డును రైతులు, మహిళలు, యువకులు, భారతదేశంలోని తన తోటి పౌరులందరికీ అంకితం చేస్తున్నానని తెలిపారు.