భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఎక్కువ సంఖ్యలో భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
2023 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా అంతర్జాతీయ తరగతులను ఏర్పాటు చేస్తామన్నారు.