ఏపీ ప్రభుత్వం నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుండి వచ్చే నెల 9వరకు పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఈ ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీఆర్వోలు నిర్వహిస్తారని, జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది.
నేటి నుండి రిజిస్ట్రేషన్లు చేపట్టాలని అధికారులకు జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి సూచించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు అందించిన ఇంటిపట్టాలను గ్రామ, వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వాధికారులకు అవగాహన సదస్సును గుంటూరు కలక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు.