కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరసగా ఆరో బడ్జెట్ను సమర్పించనున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేయనున్నారు. దేశంలో తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఘనత సాధించిన నిర్మలా.. 2019 జులై నుంచి ఇప్పటివరకు ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వచ్చే వారంలో బడ్జెట్ను సమర్పిస్తే ఆరోది అవుతుంది.