ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయం హీటెక్కుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.. వైసీపీ ప్రభుత్వంలోని తప్పులను ఎత్తిచూపుతున్నారు. దీంతో షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘నా అక్క చెల్లెమ్మలు’అని ప్రతి సభలోనూ చెప్పే సీఎం జగన్ సొంత చెల్లి షర్మిలపై సొంత పార్టీ నేతలే పోస్టింగ్‌లు పెడుతుంటే మాత్రం సెలైంట్‌గా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.