గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.