భారీ విగ్రహాలు పెట్టినంత మాత్రాన పేదల ఆకలి తీరదని షర్మిల అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం రూపొందించారని.. కానీ ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని కొంత మంది నియంతల్లా కాలరాస్తున్నారని జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. కొంతమంది అంబేడ్కర్‌కు పెద్దపెద్ద విగ్రహాలు పెడుతున్నారని, కానీ 100 శాతం సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. ‘ప్రశ్నించిన దళిత యువకుడికి గుండు గీసి అవమానించారు. దళిత డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి పడేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారు’ అని మండిపడ్డారు. దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నవారికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.