IRR(ఇన్నర్ రింగ్ రోడ్) భూకుంభ కోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఈనెల 10వ తేదీన ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. బీజేపీ కేసులు పెడుతుందని భయపడటం మానేసి ధైర్యం తెచ్చుకొని పోరాడాలన్నారు. భయపడినకొద్దీ మరింతగా లొంగదీసుకునేందుకు చూస్తారని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తేనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలరని చెప్పారు.