విశాఖ జీవీఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు జివిఎంసి ప్రధాన కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అదనపు కమిషనర్ శ్రీనివాసరావు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 93 అర్జీలు స్వీకరించినట్టు తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జివిఎంసి కమిషనరు ఆదేశించారన్నారు.