రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా సోమవారం ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో విద్యార్ధులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ వి రాజ్ కమల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని కోరారు. 10 మరణాలలో 7 మరణాలు అధిక వేగంతో వాహనాలని నడపడం వలన జరుగుతున్నాయని, ప్రమాదం జరిగినపుడు క్షతగాత్రులను సకాలంలో వైద్య చికిత్స అందాలని అన్నారు.