మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 4న జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతానని బాలశౌరి ప్రకటించారు. కాగా.. ఆయన ఈనెల 13న వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.