డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఛార్లెస్ లిటిల్‌జాన్ అనే వ్యక్తిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. ది ఇంటర్నేషనల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు చెందిన కాంట్రాక్టులు నిర్వహించే సంస్థలో గతంలో నిందితుడు పనిచేశాడు. అప్పుడే వేలాదిమంది సంపన్నుల పన్ను రిటర్నుల సమాచారాన్ని తస్కరించాడు. ఇది ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకుంది.