ఓ స్టేషన్ నుంచి బయలుదేరేలా రిజర్వేషన్ చేయించుకొని, తర్వాతి స్టేషన్లలో రైలు ఎక్కి.. నా బెర్త్ ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించడం ఇకపై కుదరదు. రైలులో రిజర్వేషన్ వివరాలను టీటీఈలు కొంత కాలంగా ట్యాబ్స్ ద్వారా పరిశీలిస్తున్నారు.
వాటిలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్ అవుతాయి. ఓ స్టేషన్‌లో రిజర్వేషన్ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే.. తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్‌ఏసీమలిస్ట్‌లో ఉన్నవారికి ఆ బెర్త్‌లు కేటాయించనున్నారు.