ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సీఎం జగన్ తో ప్రాణహానీ ఉందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మంగళవారం మాట్లాడిన ఆయన వైసీపీ సర్కార్ పని తీరును విమర్శించారు.
అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని అన్నారు. ఆయనకు తల్లి, చెల్లి, బాబాయ్ అని తేడా లేదని అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో షర్మిలను అడ్డు తొలగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.