టీడీపీకి ఒంగోలు ఒక పెద్ద సమస్యగా తయారైంది. పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్ నడుస్తోంది. ఒంగోలు ఎంపీ స్థానాన్ని టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలుచుకుంది.
కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఒంగోలు సీటుపై వైసీపీ జెండా పాతింది. దీంతో టీడీపీకి ఇది పెద్ద సవాల్ గా మారింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీని పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.