కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ మరో కీలక ప్రకటన చేసింది. కొత్తగా విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు స్థానిక కాలేజీలను రెండేళ్లపాటు అనుమతించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా,
విదేశీ విద్యార్థులకు సంబంధించి మరి కొన్ని నిబంధనలు కూడా అమల్లోకి తెచ్చేందుకు బ్రిటీష్ కొలంబియా ప్రభుత్వం యోచిస్తుంది. భాషాపరమైన నిబంధనలు, ఉద్యోగ మార్కెట్కు సంబంధించిన రిక్వైర్మెంట్స్ ప్రమాణాలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.