మన దేశంలో అత్యాధునిక ట్రైన్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఒక ట్రైన్ తయారీకి అయ్యే ఖర్చు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల అంచనా ప్రకారం,
ఒక స్లీపర్ కోచ్ తయారీకి సుమారు రూ. 1.25 కోట్లు, జనరల్ బోగీ తయారు చేయడానికి రూ. కోటి, ఏసీ కోచ్ కి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందట. ఇక ఇంజిన్ తయారీకి రూ.20 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన ఒక్క ట్రైన్ తయారీకి రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నివేదికలు చెబుతున్నాయి.