అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీ.. ట్రంప్ పేరును ప్రతిపాదించారు. దాంతో ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ట్రంప్ పేరు నాలుగోసారి నామినేట్ అయింది.
గత 30 ఏళ్లలో తొలిసారి శాంతి ఒప్పందాలను సులభతరం చేయడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించాడని క్లాడియా టెన్నీ అభిప్రాయపడ్డారు. అందుకే ట్రంప్ పేరును నోబెల్ పురస్కారానికి నామినేట్ చేసినట్లు ఆమె తెలిపారు.