జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా రవాణా మంత్రి చంపాయ్ సోరెన్ ఎంపిక. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసారు. అయితే, సీనియర్ సభ్యుడు చంపై సోరెన్‌ను జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా జేఎంఎం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు. దీనికి హేమంత్ సోరెన్ ఆమోదం తెలపడంతో చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి కానున్నారు.