తన భర్తకు 500మహిళలతో సంబంధం ఉందని ఓ భార్య మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. తంజావూరుకి చెందిన ఆర్తిమదురై తన భర్త వివేక్‌రాజ్ సెల్‌ఫోన్ చూడగా అందులో 500 నుంచి 1000 వరకు అసభ్యకర వీడియోకాల్ స్క్రీన్‌షాట్‌లు, అసభ్యకర ఫొటోలు ఉన్నట్లు తెలిసిందన్నారు. దీనిపై భర్త, తల్లిదండ్రులను అడగ్గా బయట ఎవరికీ చెప్పకూడదని బెదిరించినట్లు తెలిపారు.