ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైయస్.జగన్ ప్రభుత్వంలో మరో గొప్ప ముందడుగు పడింది. ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలోకి ఐబీ విద్యావిధానం వచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐబీ మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పంద పత్రాలు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ Anton beguin మార్చుకున్నారు. ఈ సందర్భంగా IB Director general, olli pekka heinonen మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.ఏపీ ప్రభుత్వంతో మా ప్రయాణం ప్రారంభం అవుతుంది.ఐబీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ గారికి, విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు అని తెలిపారు.