అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. అసెంబ్లీ నియోజకవర్గాలకు,పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైయస్ఆర్‌సీపీ..తాజాగా ఐదో జాబితాను విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్రకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్‌చార్జ్‌ల మార్పును ప్రకటించారు. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పును ప్రకటించారు. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ ప్రకటించింది.
అరకు (ఎస్టీ)- రేగం మత్స్యలింగం
కాకినాడ(ఎంపీ) -చలమశెట్టి సునీల్
మచిలీపట్నం(ఎంపీ) - సింహాద్రి రమేశ్ బాబు
అవనిగడ్డ- డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు
నరసరావుపేట(ఎంపీ)-పాలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్
సత్యవేడు(ఎస్సీ)- నూకతోటి రాజేష్
తిరుపతి( ఎస్సీ)( ఎంపీ)- మద్దిల గురుమూర్తి
ఇదిలా ఉంటే.. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో జాబితాలో 8 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తూ వైయస్ఆర్‌సీపీ జాబితాలు విడుదల చేసింది.