గుంటూరుకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి చుక్కా విల్సన్ బాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో విల్సన్ వైయస్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు విల్సన్‌కు సీఎం వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి వైయస్ఆర్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చుక్కా విల్సన్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.