వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వి. విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. అలాగే ఒంగోల్ పార్లమెంట్ నియోజకవర్గం, కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజనల్ కో-ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.