వైయస్ఆర్‌సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు.