ప్రపంచ స్థాయిలో క్రీడాకారులను అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్ధ ఆత్మకూరు వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ సర్కిల్,పంపు హౌస్,పైప్ లైన్లు పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్సీ మరుగుడి హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి,జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి,ఎంటిఎంసి కమిషనర్ నిరంజన్ కుమార్ లతో కలిసి అభివృద్ధి పనులను విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడారు..మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ 8.5 కోట్ల రూపాయలతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని,రాష్ట్రం నుండి ప్రపంచ స్థాయిలో మన క్రీడాకారులను అందించాలనే ఉద్దేశంతో అందులో భాగంగానే మంగళగిరిలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని అన్నారు.. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు..మన ముఖ్యమంత్రి విద్య,వైద్యం,గృహ నిర్మాణానికి అధిక ప్రధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు.