కోసిగి మండలం చిర్తనకల్లులో వెలసిన శ్రీ మారెమ్మ అవ్వ దేవర ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం మంత్రాలయం టీడీపీ నేతలు ఉలిగయ్య, రామకృష్ణారెడ్డి హాజరై పెద్దమ్మ, దేవమ్మ, మారెమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. కబడ్డీ పోటీలలో విజేతగా నిల్చిన టీంకు మొదటి బహుమతి రూ. 15 వేలను రామకృష్ణారెడ్డి, రెండవ బహుమతి రూ. 10వేలు ముత్తరెడ్డి అందజేశారు. అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఉన్నారు.